ఈ సంస్థ 1983లో 800 కారుతో భారతీయ ఆటోమోటివ్ రంగంలోకి ప్రవేశించింది. 1985 నుంచి మారుతి సుజుకి ఇప్పటికీ తన సత్తాను చాటుతోంది. 800 దాని ఆధారంగా వ్యాన్ నుంచి మారాలని చూస్తున్నప్పుడు, మహీంద్రా నుంచి ఇండియాలో తయారుచేయబడిన జీప్లపై దృష్టి పెట్టింది. దానికి ధీటుగా జిప్సీ ఆఫ్రోడర్ను భారతదేశంలోకి తీసుకువచ్చింది. మారుతి సుజుకి ‘జిప్సీ’గా పిలువబడే SJ40 సిరీస్ భారతదేశంలో చాలా కల్ట్ ఫాలోయింగ్‌ను పొందింది.
జిప్సీ SJ40 సిరీస్ ఆధారంగా తాజాగా మారుతి జిమ్నీని సంస్థ తీసుకువచ్చింది. గత రెండు తరాలుగా జిప్సీ తన హవాను కొనసాగిస్తోంది. మారుతి సుజుకి డిసెంబర్ 2018 వరకు పౌరుల కోసం జిప్సీ ఆర్డర్లను తీసుకోవడాన్ని కొనసాగించింది . ఉద్గార మరియు భద్రతా నిబంధనలను కఠినతరం చేయడానికి ముందు ఈ ఆఫ్రోడర్కు గిరాకీ ఎక్కువగా ఉండేది.
అప్పటి నుండి, 4వ జనరల్ జిమ్నీ భారతదేశానికి వస్తున్నారనే పుకార్లు దేశవ్యాప్తంగా ఆటోమోటివ్ వార్తల్లో చక్కర్లు కొట్టాయి. మారుతి సుజుకి ఆటో ఎక్స్పో 2023లో భారతదేశం కోసం సరికొత్త జిమ్నీని వెల్లడించినప్పుడు ఊహాగానాలకు దానికి తెరతీశ0/p>
ఏది ఏమైనప్పటికీ, మారుతి సుజుకి జిమ్నీ మూడు-డోర్ల లేఅవుట్‌కు బదులుగా ఐదు డోర్లను కలిగి ఉంది, ఇది పవర్‌ప్లాంట్ నుంచి వచ్చే అవుట్‌పుట్‌లో పెరుగుదల లేనందున కొత్త SUV ఎలా పని చేస్తుందనే దాని గురించి మాకు చాలా ఆసక్తిని కలిగించింది.
కాబట్టి డెహ్రాడూన్ సమీపంలో కొత్త జిమ్నీని పరీక్షించడానికి మారుతీ సుజుకి మాకు అవకాశం ఇచ్చినప్పుడు, డర్ట్ ట్రాక్‌లలో కొత్త కింగ్ మేకర్ అవుతుందా అని పరశీలించజానికి మేము దీనిని రివ్యూ చేశాము. దీనికి సంబంధించి ఫుల్ వివరాలు ఈ కథనంలో మీకు మీకు అందించనున్నాము.
మారుతి సుజుకి ఫీచర్స్ & డిజైన్..
మారుతి సుజుకి జిమ్నీ దాని 3-డోర్ SUVతోసమానంగా ఉంటుంది. ప్రతి వైపు అదనపు డోర్ ఉండటం వల్ల పొడవుగా అనిపిస్తుంది. ఇండియా-స్పెక్ జిమ్నీ దాని అంతర్జాతీయ ప్రతిరూపం వలె బాక్సీగా మరియు కఠినమైనదిగా ఉంటుంది. ఇది కస్టమర్లను ఆకట్టుకోవచ్చు.
ఫ్రంట్ ఎండ్ స్పోర్ట్స్ లో వృత్తాకార LED హెడ్లైట్లు నిలువు స్లాట్లతో అనుసంధానించబడిన ఐదు క్రోమ్ తో ఉండనున్నాయి. మధ్యలో సుజుకి బ్యాడ్జ్‌ని కలిగి ఉంటుంది. హెడ్లైట్ల దగ్గర గ్రిల్ వద్ద టర్న్ ఇండికేటర్లు గుండ్రంగా ఉండనున్నాయి.
SUV చక్రాల వద్ద గ్రౌండ్ క్లియరెన్స్‌ని పెంచడానికి మారుతి సుజుకి జిమ్నీలో ఫ్రంట్ బంపర్లు ఉంటాయి. కఠినమైన ప్లాస్టిక్‌ని ఉపయోగించి తయారు చేయబడిన, బంపర్లు ఫాగ్ ల్యాంప్‌లు మరియు పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌కు హోస్ట్‌గా ఉంటాయి.
15-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో ఇది రానుంది. పూర్తి ప్లాస్టిక్ తో తయారు చేయబడిన ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు(టైర్ బయట కప్పి ఉంచే భాగం) వస్తుంది. ఐదు-డోర్ల లేఅవుట్‌కు మారడం వలన వెనుక మూడు-వంతుల గాజు ప్యానెల్ ను ఇందులో తగ్గి ఉంటుంది.
జిమ్నీ డ్యూయల్-టోన్ వెర్షన్లలో బ్లూయిష్-బ్లాక్ షేడ్‌లో పూర్తి చేయబడిన రూఫ్, మీరు SUVలోకి ప్రవేశించినప్పుడు లేదా మీరు దిగేటప్పుడు నీరు లేదా బురద మీపై పడకుండా చూసేందుకు అన్ని వైపులా వెనుక భాగంలో డ్రిప్ పట్టాలను కలిగి ఉంటుంది.
మారుతీ సుజుకీ జిమ్నీ ఎస్యూవీ వెనుక డోర్‌పై అమర్చిన స్పేర్ వీల్ మినహా మిగిలిన భాగం అంతా బాక్సీగా ఉంటుంది. మూడో బ్రేక్ లైట్ మినహా జిమ్మీ వాహనం మొత్తం బ్యాక్ లైటింగ్ సెటప్.. రేర్ బంపర్లోని రెండు పాడ్లలో చూడవచ్చు.
మారుతీ సుజుకీ జిమ్నీ లోపలి భాగం ఎంతో మంచి అనుభూతిని కలిగిస్తుంది. మరియు 7 లేదా 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్ర్రీన్ ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ స్ర్కీన్ పాటలు, నెవిగేషన్ అవసరాలతోపాటు పాటు బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే ఆప్షన్లకు అనుమతి ఇస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చుట్టు ఉన్న సౌండ్ సిస్టమ్‌తో కనెక్ట్ చేస్తుంది.
కారులోని సీట్లలో కూర్చున్న ప్రయాణికులు రఫ్ రోడ్లపై ప్రయాణిస్తుప్పుడు స్థిరంగా కూర్చొనే విధంగా ఫీచర్లు ఉంటాయి. దాంతోపాటు ప్రయాణికులు పట్టుకొని కూర్చొనేందుకు గ్రాబ్ రైల్ ఉంటుంది. డ్యాష్ మరియు ఇతర విభాగాలు స్క్రాచ్ ఫ్రూప్ మెటిరియల్తో తయారుచేయబడ్డాయి.
మారుతీ సుజుకీ జిమ్మీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD కూడిన ABS, బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, రియర్ వ్య్వూ కెమెరా మరియు చిన్నారుల సీట్ల కోసం ISOFIX యాంకర్ పాయింట్లతో సహా అనేక భద్రతా ఫీచర్లు ఈ వాహనం సొంతం.
మారుతీ సుజుజీ జిమ్నీ స్పెసిఫికేషన్లు డైమెన్షన్లు
మారుతీ సుజుకీ జిమ్నీ కారు K15B 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉం /p>
ఈ కారు ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రాన్సిమిషన్ సిస్టమ్ సుజుకీ ఆల్ గ్రిప్ ఆర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అనుసంధానించబడి ఉంటుంది. జిమ్నీ SUV తక్కువ రేంజ్ ట్రాన్సఫర్ బాక్స్ కూడా కలిగి ఉంటుంది.
మారుతీ సుజుకీ జిమ్నీ 15 అంగుళాల టైర్లను కలిగి ఉంటుంది. స్టీల్ మరియు అల్లాయ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 195/80 R15 మోడల్ టైర్లు కలిగి ఉంటుంది.
మారుతీ సుజుకీ జిమ్నీ కారు 3.985mm (స్పేర్ వీల్‌తో కలిపి) పొడవు, 1,645mm వెడల్పు మరియు 1,720mm ఎత్తు, మరియు 2,590mm వీల్‌బేస్, బరువు 1210 కేజీలు ఉంటుంది. కారు 210 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు 208 లీటర్ల బూట్స్పెస్తో వస్తుంది.
మారుతీ సుజుకీ జిమ్నీ డ్రైవింగ్ ఇంప్రెసన్స్
మారుతీ సుజుకీ జమ్నీ కారు లేడార్ ఫ్రేమ్ ఛాసిస్, ఆఫ్ రోడింగ్ సస్సెన్షన్ సెటర్తో వస్తుంది. కారు ఇంజిన్‌కు ఎక్కువ శక్తి ఉండాలని ఆశిస్తున్నాం. మిడ్ మరియు టాప్ ఎండ్ ఇంజిన్ పవర్‌తో సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. మరియు కారు సస్పెన్షన్ వ్యవస్థ నిజంగా మిమ్మల్ని ఆశర్యపరుస్తుంది. యూ టర్న్, ఇతర మలుపుల వద్ద ఎంతో సులభంగా టర్నింగ్ చేయవచ్చు.
మారుతీ సుజుకీ జమ్నీ రెండు గేర్ బాక్స్‌ల వినియోగం ఎంతో సులభంగా ఉన్నా.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించడం మనకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. జిమ్నీలో ఉన్న మాన్యువల్ గేర్లు డ్రైవర్‌కు కొంచెం నియంత్రణ అందిస్తున్నప్పటికీ.. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఒకటి, రెండు గేర్ల వినియోగం కొంచెం పరిమితం చేస్తంది. అలాగే ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్లకుండా చూస్తుంది.
ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లో నాలుగు గేర్లతో డ్రైవింగ్ మంచి అనుభూతిని ఇస్తుంది. పొరపాటున ఓ టైర1/p>
మారుజీ సుజుకీ జిమ్నీ కారులో ఎక్కడైనా కొంచెం ఏటవాలుగా లేదా ఎత్తైన ప్రాంతాల్లో నిలిచిపోయినప్పుడు హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వ్యవస్థతో సౌకర్యవంతంగా వాహనాన్ని అదుపుచేయవచ్చు.మారుతీ సుజుకీ జిమ్నీ ఆకర్షణీయమైన క్యాబిన్, మంచి ఆన్‌రోడ్ డ్రైవింగ్ అనుభూతి సహా మరిన్ని ఫీచర్లు.. ఈ కారు ఎంతో మందికి మంచి ఎంపిక కానుంది.
- TVS NTorq 125 Review: A Feature-Packed Sporty Scooter For The Masses
- LS polls: Bihar sees lowest turnout with 50%, WB tops with 81%
- Apollo Tyres Consolidated September 2019 Net Sales at Rs 3,985.81 crore, down 6.38% Y-o-Y
- Bollinger reveals four-door B1 electric SUV and B2 electric pickup
- ಆಸ್ಟ್ರೇಲಿಯಾದಲ್ಲಿ ನಡೆಯಲಿರುವ ಐಸಿಸಿ ಟಿ20 ವಿಶ್ವಕಪ್ 2020 ವೇಳಾಪಟ್ಟಿ
- MLB 2020 Power Rankings: Red Sox Bounce Back and are #3…Ahead of Yankees?
- Do Less, Achieve More: The Beauty Of Effective Delegation
- 2019 FIBA World Cup schedule, results
- NHL Power Ranking: New York Islanders Are #16, Behind the Canadiens and Ahead of Canucks In Computer Projection
- Morrisons’ £10 prosecco named top fizz in Good Housekeeping’s blind taste test of Christmas food and drink
- De Villiers 1st on MVP standings. Guess who's 5th?
- Ranji round-up: Tyagi shines for Railways
- Which Indian bowler has ODI figures of 6/4?
- Billboard Dance 100 Artists of 2018: The Complete List
- GE T&D India Standalone September 2019 Net Sales at Rs 821.07 crore, down 17.34% Y-o-Y
- Bollinger’s electric truck is nothing like a Tesla, and that’s OK
- From Oedipus to The History Boys: Michael Billington's 101 greatest plays
- Every time the U.S. men’s basketball team lost since the Dream Team
Maruti suzuki jimny Full Review మారుతి సుజుకి జిమ్నీ ఇంజిన్, డిజైన్, ఫర్ఫామెన్స్, ఫీచర్లు.. పుల్ రివ్యూ have 275 words, post on telugu.drivespark.com at May 26, 2023. This is cached page on Auto News. If you want remove this page, please contact us.